కోరుట్ల

నిరంతర సాధనే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు సీఐ సురేష్ బాబు

viswatelangana.com

April 29th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని రామక్రిష్ణ డిగ్రీ&పిజి కళాశాల లో మొదటి మరియు రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మూడవ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు వేడుకలు ” విగమ 2025″ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోరుట్ల సీఐ బి సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ గా ఉంటూ ఉన్నత విద్యను చదివి సమాజంలో మార్పు తీసుకు రావాలని నిరంతర సాధన ద్వారా విజయం సాధించవచ్చని విద్యార్థులకు నిర్దేశనం చేశారు. కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా జీవితంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి . ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గాడి పెళ్లి హరిప్రియ అంజయ్య గౌడ్, ప్రిన్సిపాల్ బెజ్జారపు ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button