రాయికల్
నూతన అధ్యక్షులుగా శ్రీనివాస్ యాదవ్

viswatelangana.com
April 10th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గురువారం రోజున శ్రీకృష్ణ యాదవ సంఘం, నూతన కమిటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు భూషణవేణి శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు నేతుల సోమయ్య యాదవ్, కోశాధికారి పంచతీ గంగాధర్ యాదవ్, కార్యదర్శి మామిడి గంగాధర్ యాదవ్, సలహాదారులు నేతుల రాజేందర్ యాదవ్, కొక్కెర చంద్రశేఖర్ యాదవ్, సహాయ కార్యదర్శి భూషణ్ వేణి రాజశేఖర్ యాదవ్ మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యాదవులంతా కలిసిమెలిసి ఉండాలని, సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



