రాయికల్

నెల రోజుల్లో ప్రజలకు శుద్ధ జలం అందించాలి

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

viswatelangana.com

March 25th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు శుద్ధ జలం అందించే ఉద్దేశంతోనే ఫిల్టర్ బెడ్ మరమ్మత్తులు 14 కోట్ల నిధులు మంజూరు చేశారని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకం మరమ్మత్తు పనులను ఇరిగేషన్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం రాయికల్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వం తలపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీరు సరఫరా చేస్తామని ప్రకటించినప్పటికీ నీరు అందలేదన్నారు.డబ్బా నుండి వచ్చే నీరు సుమారు 40 కిలోమీటర్లు ఉండగా 20 కిలోమీటర్లు పైగ నీటి సరఫరాతో క్లోరినేషన్ కోల్పోయి వచ్చిన నీరు శుద్ధ జలం ఎలా అవుతుందన్నారు.జగిత్యాల్ నియోజకవర్గ పరిధిలో రాయికల్, బీర్పూర్, జగిత్యాల్ మండలం పొలాస ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకం పునరుద్ధరణకు సి పి డబ్ల్యూ ఎస్ నిధుల నుండి రూ.14 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారని అందులో భాగంగానే రాయికల్ ఫిల్టర్ బెడ్ కు రూ.4.97 కోట్లు నిధులు మంజూరు తో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయన్నారు. గతంలో అలం క్లోరినేషన్ నీటి సరఫరా అమల్లో ఉండేదని ప్రస్తుతం ఫిల్టర్ షాన్, ఫిల్టర్ గ్యాస్ క్లోరినేషన్ పద్ధతిలో శుద్ధ జలాన్ని నెల రోజుల్లో అందించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాయికల్ పట్టణంలోని 9,10,11. వార్డుల్లో నీటి కొరత తీర్చేందుకు పైప్ లైన్, బూస్టర్ పంపు, టాంకర్స్, బోర్ వెల్ ద్వారా త్రాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమృత్ పథకం అమలకు రాయికల్ పట్టణంలో స్థల సేకరణ చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రాయికల్ పట్టణంలో 4 వాటర్ ట్యాంకులు ఉన్నాయని ఫిల్టర్ బెడ్ నుండి వాటర్ ట్యాంకులకు నీరు చేరేందుకు కొత్త పైప్ లైన్ కనెక్షన్ చేపట్టాలన్నారు. సమయం వృధా కాకుండా పాత పైప్ లైన్ ద్వారా వాటర్ పంపి మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఇరిగేషన్ డి ఈ జలంధర్ రెడ్డి, ఏఈ లు ప్రసాద్, దీపక్, చంద్రకాంత్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button