కథలాపూర్

న్యాయం కావాలి అంటున్న బాధితులు

viswatelangana.com

July 6th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో అంగన్వాడీ ఆయా అకృత్యాలు 3 సంవత్సరాల బాలుడి చెంప మీద కొట్టిన ఆయా బాలుడి చెంప మీద 5 వేళ్ళ అచ్చులు బాలుడి తల్లిదండ్రులను బెదిరించిన మాజీ సర్పంచ్ భర్త మాకు న్యాయం చేయండి సారూ అంటున్న బాధితులు. ఎమ్మెల్యే తో గోడును వెళ్ళబోసుకున్న తల్లిదండ్రులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన బోయిని రాజేశం కుమారుడు బోయిని శ్రీనాథ్ 3 సం. వయసు ప్రతిరోజు అంగన్వాడి సెంటర్ కు వెళ్తుంటాడు. రోజులాగానే ఒకరోజు అంగన్వాడి సెంటర్ కు వెళ్లగా ఆయమ్మ అల్లె నర్సవ్వ చెంప మీద గట్టిగా కొట్టింది.ఆ బాలుడి చెంపమీద 5 వేళ్ళు అచ్చులు పడ్డాయి. వెంటనే ఆ బాలుడు కింద పడిపోయాడు. ఈ విషయం తెలిసిన ఆ బాలుడి తల్లిదండ్రులు బాధతో ఆయమ్మ అల్లె నర్సవ్వ ను మా కుమారుడిని ఎందుకు కొట్టావని నిలదీయగా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరించ సాగింది.ఈ విషయంలో మాజీ సర్పంచ్ పిడుగు లావణ్య భర్త తిరుపతిరెడ్డి జోక్యం చేసుకొన్నాడు. తప్పు చేసిన ఆయమ్మను నిలదీయాల్సింది పోయి ఆ బాలుడి తల్లిదండ్రులతో దురుసుగా మాట్లాడుతూ నేను అధికార పార్టీలో ఉన్నానని మీ అంత చూస్తా అంటూ బెదిరించాడు ఆ బాలుడి తల్లిదండ్రులు అంగన్వాడి సెంటర్ పై అధికారులకు ఫిర్యాదు చేయగా ఆ అధికారులు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కానీ ఆ అంగన్వాడి ఆయా అల్లె నర్సవ్వ మరియు మాజీ సర్పంచ్ భర్త పిడుగు తిరుపతిరెడ్డి బెదిరించడంతో భయభ్రాంతులకు గురైన ఆ తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు తమకు ప్రాణహాని ఉందని కూడా తెలపడం జరిగింది వెంటనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆ బాలుడి తల్లిదండ్రులని ఓదార్చి,తహసిల్దార్ కు తగిన చర్యలు తీసుకోమని తెలపడం జరిగింది. స్థానిక తహసిల్దార్ ముంతాజీబొద్దీన్ ఆ బాలుడి తల్లిదండ్రుల దగ్గర నుండి వినతిపత్రం తీసుకోవడం జరిగింది. ఆ బాలుడి తల్లిదండ్రులు మాకు న్యాయం చేయండి సారు. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడిని కొట్టిన ఆయా ను తక్షణమే విధుల్లోంచి తొలగించాలని, బాలుడి తల్లి దండ్రులను బెదిరించిన మాజీ సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Related Articles

Back to top button