కథలాపూర్
న్యూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రోత్సవాలు

viswatelangana.com
September 7th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండల న్యూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ ప్రతిష్టాపన న్యూ ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది.ఈ సందర్భంగా న్యూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దర్శనాల లతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని ప్రోత్సహించాలని అన్ని గ్రామాల గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు ఏ గొడవలు లేకుండా జరుపుకోవాలని తెలిపారు. ప్రధాన కార్యదర్శి దీకొండ గణేష్ మాట్లాడుతూ అన్ని గ్రామాల ప్రజలు ఈ నవరాత్రులు ఏ గొడవలు లేకుండా అందరూ ఐక్యమత్యంతో నిర్వహించాలని భక్తులకు విన్నవించారు. ఈ కార్యక్రమం లో న్యూ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దర్శనాల లతీష్, ప్రధాన కార్యదర్శి దీకొండ గణేష్, సభ్యులు కొండా నవీన్,తొగిటి సంతోష్, తొగరి రాజేందర్, మర్రిపెల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.



