కథలాపూర్
పంచాయతీ పాలక వర్గానికి సన్మానం
viswatelangana.com
February 6th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామ పంచాయతీ పాలక వర్గం(2019-2024) సభ్యులను వారి పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి గఫుర్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కూన సులోచన, మాజీ వార్డు సభ్యులు లింగారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కొండా నవీన్, ఫాతిమా, వనజ, కళావతి మరియు పృథ్వీ,మహేందర్ రెడ్డి, పుల్లారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, మహిళ సంఘం వీవో లు, గ్రామస్తులు పాల్గొన్నారు.



