రాయికల్
పట్టుదలతో సాధన చేస్తే విజయం మీ సొంతం

viswatelangana.com
March 15th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ జడ్.పి.హెచ్.ఎస్ రాయికల్ ఎస్ఎస్సి 1989 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అదే ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంచడం జరిగింది. ఇందులో పూర్వ విద్యార్థులైన మొహమ్మద్ నయీమ్ మాట్లాడుతూ పట్టుదలతో సాధన చేస్తే విజయం మీ సొంతం. పిల్లలు భయాందోళన వీడి ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలన్నారు. ఉపాధ్యాయులు సూచనలు పాటిస్తూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాల పేరు తేవాలని అన్నారు. ఇందులో పూర్వ విద్యార్థుల దాత రమేష్ ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రం మనోహర్ నరేందర్ గణేష్ రఫీ రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.



