రాయికల్
పది ఫలితాలలో ప్రగతి సునామి

viswatelangana.com
April 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
పదో తరగతి ఫలితాల్లో రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి విద్యార్థులు సునామీని సృష్టించారు. నలుగురు విద్యార్థులు 10/10 జిపిఏ సాధించి మండల స్థాయి ప్రథమ స్థానాన్ని పొందారు. 26 మంది విద్యార్థులు 9.0 జిపిఏకు పైగా సాధించి, మండల స్థాయి రికార్డును సృష్టించారు. ఇట్టి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.



