కోరుట్ల
పల్లె గంగారెడ్డికి సన్మానం

viswatelangana.com
January 17th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
తెలంగాణ రాష్ట్రం ఇందూరు నియోజకవర్గంలో జాతీయ పసుపు బోర్డుకు మొదటి చైర్ పర్సన్ గా బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి నియమితులైన సంధర్భంగా కోరుట్ల పట్టణ బిజెపి నాయకులు ఆయనను అంకాపూర్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి డా. యాదగిరి బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇట్యాల నవీన్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుదవేని మహేష్, పట్టణ మాజీ అధ్యక్షులు తిరుమల ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.



