కోరుట్ల

పాకిస్తాన్ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు

viswatelangana.com

April 23rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జమ్ము కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహాల్గం లోని బైసారన్ లోయలో పాకిస్థాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ “ది రెసిస్టెన్స్ ఫ్రంట్”అనే ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో 28మంది మృతి చెందడం, 20 మందికి తీవ్ర గాయాలు కావడం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాను. దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని తుద ముట్టించాల్సిన అవసరం ఉందని, ఈ విపత్కర సమయంలో దేశ ప్రజలందరూ ఒక్కటై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు. తక్షణమే వారికి ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలని కేంద్రాన్నీ డిమాండ్ చేస్తున్నాను… రాష్ట్ర ప్రభుత్వం తరపున అండగా ఉండి ఆదుకుంటాం. కాంగ్రెస్ పార్టీ పక్షణా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాని జువ్వాడి కృష్ణ రావు తెలిపారు.

Related Articles

Back to top button