పాఠశాలకు టీవీ బహుకరించిన ఉపాధ్యాయుడు

viswatelangana.com
ప్రాథమిక పాఠశాల వీరాపూర్ విద్యార్థులకు దృశ్య శ్రావణ బోధన కొరకు అవసరమైన 20000/-రూపాయల విలువ గల టీవీ ని పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు కన్నవేని మల్లారెడ్డి వారి తండ్రి క్రీ శే కన్నవేని గంగారెడ్డి జ్ఞాపకార్థం పాఠశాలకు బహుకరించారు. అలాగే పాఠశాల ముందస్తు బడిబాట కరపత్రంను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ భోగ రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా భోగ రమేష్ మాట్లాడుతూ బడిఇడు పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. వీరాపూర్ గ్రామం నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసి ఫలితాలలో 437/440 సాధించిన చెదలి హాసిని ని గ్రామస్తులు సన్మానించారు. 2024-25 విద్యాసంవత్సర ప్రగతి పత్రాలు తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, గ్రామ కార్యదర్శి స్వర్ణ, తాజా మాజీ ఉపసర్పంచ్ మహబూబ్, ఏ ఏ పీ సి అధ్యక్షురాలు లావణ్య, గ్రామస్తులు సోమ వెంకటేష్, మహిపాల్ ఇబ్రహీం, రాజేష్, షరిఫుద్దీన్ మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.



