రాయికల్

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com

March 16th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001 -2002 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.పూర్వ విద్యార్థులు గడిచిన.. ఆ పాత బాల్య విద్యాభ్యాస క్షణాలను తెచ్చుకొని ఆనందించడం,ఎక్కడ ఉన్నా మరవని ఈ స్నేహం ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించడం జరిగింది. అనంతరం విద్య బుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కామని లక్ష్మణ్, గుర్రం శ్రీనివాస్ గౌడ్, కూరగాయల సురేష్, జక్కుల చంద్రశేఖర్, పడకంటి శ్రీనివాస్, బొల్లె చిన్నయ్య, గుర్రం మారుతీ మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button