పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కల్వకోట గ్రామంలో మంగళవారం రోజున గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ కల్వకోటలో పూర్వ విద్యార్థులు 2006 – 2007 సంవత్సరం బ్యాచ్ గల 10 తరగతి విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరందరూ చాలా రోజులకు కలుసుకున్నందుకు మాకు సంతోషంగా ఉందని, మధురమైనది స్నేహ బంధం మరపురానిది స్నేహ బంధమ్ సృష్టి లో అన్నింటినీ మించి అందరిని అలరించే బంధం
స్నేహ బంధం
మనుషులు వీడి దశబ్దం గడిచింది మనుసులు అప్పుడప్పుడు కలుసుకున్న కానీ మనుషులు కలవాలని కలపాలని కోరిన వేదిక ఆత్మీయ సమ్మేళన వేదిక స్నేహితుల కొలువు ఈ వేదిక ఎన్నో గ్యాపకాలు ఎనేన్నో సంతోషాలు ఎన్నెన్నో సరదాలు చేసిన చిలిపి పనులు కలబడిన కలహాలు వాదనలు తాగదాలు స్నేహం లో శారా మాములే కలిసిన హృదయాలతో ఆత్మీయ కలయికలు కలకాలం మరిచిపోని ఎన్నెన్నో తీపి గుర్తులు ఎద నిండా పరవాలని ఆప్యాయత లు పంచాలని అభిమానాలు చటాలని ఏర్పారుచుకున్న అభినివేషమే నేటి ఈ సమావేశం. ఈ దశబ్దం లో ఎవరెవరి జీవితాలలో ఎన్నెన్నో మలుపులు ఎన్నెన్నో సంఘటనలు అవి సంతోషాలైన ఆనందలైన ఆపదలైన విషాదలైన అన్ని మరిచి అన్ని విడిచి ఆనందం తో అందరిని కలిసి మనుసు విప్పి మాట్లాడుకొని ఏదనిండా సంతోషాలు సంపూర్ణంగా నింపుకొని నవ్వుతూ తుళ్లుతు కేరింతాలతో గడుపుతు ఎవ్వరు ఏ స్థితి లో ఉన్న ఎవ్వరు ఏ గమ్యం చేరిన కలిమి లో నైనా లేమిలోనైనా కలకాలం కలిసుందామని ఒకరినొకరు చెప్పుకునేరోజు ఈ రోజు అని వీరందరూ చాలా రోజు లకు కలుసుకున్నందుకు సంతోషపడ్డారు.



