పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
విశ్వశాంతి హై స్కూల్ రాయికల్ 2001-02 పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో తమ చిన్ననాటి పాఠశాల గుర్తులను జ్ఞాపకం చేసుకున్నారు, తదనంతరం తమకు విద్యను అందించిన గురువులను ఘనంగా సన్మానించారు. అప్పటి ఉపాధ్యాయులు తమ విద్యార్థుల అనుబంధాలను గుర్తుచేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రధానోపాధ్యాయులు మచ్చ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించాలని హితవు పలికారు. మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మచ్చ గంగాధర్, ఉపాధ్యాయులు గంగరాజం, సురేష్, శేఖర్, రాంరెడ్డి, మైమున విద్యార్థులు ప్రసాద్, అబ్బురి శ్రీనివాస్, రాడం శ్రీనివాస్, రాజేందర్, సురేష్ , రాంరెడ్డి , అందె రంజిత్, సరిత, నాగాంజలి, రజిత, రాజ్యలక్ష్మి, శ్రీలత, మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



