కొడిమ్యాల
పెద్దపులి వేషం వేయు వారికి పోలీసు సూచన

viswatelangana.com
July 4th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మొహర్రం సందర్భంగా పెద్దపులి వేషం వేయు వారికి పోలీసుల సూచన, కొడిమ్యాలలో ఎవరైతే పెద్దపులి వేషం వేయిచున్నారో వారి పూర్తి వివరాలు పోలీస్ స్టేషన్ నందు అందజేయవలెను, పోలీసులు ఇచ్చే సూచనలను పాటించవలెను, మీరు ఏ రోజైతే పెద్దపులి వేషం వేయాలనుకుంటున్నారో ముందే తెలియజేయడం వలన మీకు తగిన భద్రత కల్పించడం జరుగుతుంది. ఎవరైతే మీ యొక్క వివరాలు నమోదు చేయరో వారిపై జరిగే సంఘటనలకు చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. యస్.ఐ.సౌధం సందీప్, తెలిపారు.



