కోరుట్ల
పెళ్లి రోజు సందర్భంగా సివిల్ హాస్పిటల్ ఆవరణలో అల్పాహారం ఏర్పాటు

viswatelangana.com
March 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జి నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నేడు కోరుట్ల వాస్తవ్యులు లయన్ బచ్చు వెంకటరమణ – పద్మ ల పెళ్లిరోజు సందర్భంగా ఈ రోజు ఉదయం కోరుట్ల లోని సివిల్ హాస్పిటల్ ఆవరణలో అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సుమారు 140 మందికి అల్పాహారం అందివ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ బచ్చు వెంకటరమణ అనగానే కోరుట్ల ప్రజలందరూ ఆపద్బాంధవుడని పిలుస్తారని కోరుట్ల ప్రజలకు ఎల్లలేని సేవలు అందిస్తూ నేను తోడుగా ఉన్నానని ప్రజలను ధైర్యమిస్తూ వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంటారని వీరికి లయన్స్ క్లబ్ పక్షాన మరియు కోరుట్ల ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



