మెట్ పల్లి

పోగొట్టుకున్న నగలు, నగదు బ్యాగు అప్పగింత

viswatelangana.com

March 3rd, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

మెట్ పల్లి మండలం ఆత్మ నగర్ కు చెందిన సుందరగిరి అఖిల్ గౌడ్ అతని భార్య ప్రసన్నలు హాస్పిటల్ నిమిత్తం మెట్ పల్లికి బైక్ పై వచ్చే క్రమంలో వారి బ్యాగ్ మార్గ మధ్యలో ఎక్కడో పడిపోయింది. వారు ప్రయాణించిన ప్రాంతంలో వెతికిన లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ సమాచారాన్ని మెట్ పల్లి బ్లూ కోల్ట్ సిబ్బందిని పంపించి బ్యాగు కోసం వెతుకుతుండగా, కళానగర్ కు చెందిన అబ్దుల్ రహీం కు బ్యాగు దొరికింది, అట్టి అబ్యాగును పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. అబ్యాగులో రెండు తులాల బంగారు చైన్, ఒక బంగారు ఉంగరం, 50 వేల నగదు ఉండగా అ బంగారంను, నగదును స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి బాధితునికి అప్పగించారు. అ బ్యాగును తీసుకువచ్చి బాదితునికి అప్పగించిన అబ్దుల్ రహీంని మెట్ పల్లి ఎస్ఐ కిరణ్ కుమార్, పోలీసులు అభినందించారు.

Related Articles

Back to top button