రాయికల్
పోషణ పక్షోత్సవాలు..

viswatelangana.com
April 21st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఇటిక్యాల సెక్టర్ లోని ఒకటవ సెంటర్ అంగన్వాడి కేంద్రంలో సోమవారం రోజున పోషణ పక్షోత్సవాల సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు మరియు మూడు సంవత్సరములు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణీ దశ నుండి పిల్లలు రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు సంబంధించిన వెయ్యి రోజుల ప్రాముఖ్యత, పోషకాహారం, ఆరోగ్య పరీక్షల సలహాలు, సూచనలు ఇచ్చారు. మిల్లెట్స్, పాలు, పండ్లు, కూరగాయలు, ఎగ్స్, వివిధ రకాల పోషక పదార్థాల ప్రాముఖ్యత గురుంచి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సహారా, అమ్మ కమిటీ సభ్యులు, గర్భిణీలు బాలింతలు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లలు తల్లులు, తదితరులు పాల్గొన్నారు.



