రాయికల్

ప్రగతిలో ఘనంగా మహా బతుకమ్మ,దసరా వేడుకలు

viswatelangana.com

September 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో ముందస్తు మహా బతుకమ్మ వేడుకలు ఎంతో హర్షోల్లాసంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను తయారు చేసి, పాటలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. మహా బతుకమ్మను ప్రత్యేకంగా తయారు చేసి,సాంప్రదాయ నృత్యాలతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ…. బతుకమ్మ తొమ్మిది రోజుల పండగని, ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై కదుల బతుకమ్మతో ముగుస్తుందని,బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పూల పండుగ అని,తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలు ఈ సంవత్సరం అక్టోబర్ 2న ప్రారంభమై, అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయనీ, రాముడు రావణాసురుడిపై సాధించిన విజయానికి ప్రతీకగా, పాండవులు కౌరవులపై సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ చేసుకుంటామని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన నవదుర్గల నాట్యం, కల్కి అవతారం నృత్యం, అయిగిరి నందిని నృత్యం, బతుకమ్మ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందము, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button