రాయికల్
ప్రగతిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

viswatelangana.com
February 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో జ్ఞాన స్వరూపిణి సరస్వతీ మాత జన్మదినాన్ని (వసంత పంచమి) పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. సరస్వతీ మాత విగ్రహాన్ని రూపొందించి, పూలమాలతో, వీణతో అలంకరించి, సరస్వతి ప్రార్ధన మధ్య పూజలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థినిలు సరస్వతీ మాత వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలె శేఖర్ మాట్లాడుతూ సరస్వతి మాత కృపా కటాక్షము అందరిపై ఉండాలని, విద్యార్థులను మనసారా దీవించారు. ఈ సందర్భంగా ఉచిత అడ్మిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందము, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



