ప్రభుత్వ పాఠశాలలో ఐదు వందలు కు పైన మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2025 సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షల్లో 100% రిజల్ట్స్ సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాలప్రధానోపాధ్యాయురాలు ఏ.విజయేందిర అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొడిమ్యాల మండలకేంద్రానికిసంబంధించినబిజెపియువనాయకులు భోగ.రాకేష్ 500 కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా భోగ రాకేష్ మాట్లాడుతూ విద్యార్థులు మండల ప్రభుత్వ పాఠశాల పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 100% రిజల్ట్స్ తీసుకురావడం చాలా గొప్ప విషయం అని అదేవిధంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నాంపల్లి సుష్మ శ్రీ (571). జల్ద అక్షర (547) విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఈ విజయంతో ఇంకా స్ఫూర్తి నింపుకొని ముందుకు సాగి ముందు ముందు అనేక విజయాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రజలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా విద్యా బోధన ఉందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ద్వారా విద్యార్థులకు నాణ్యమయిన విద్యా అందుతుందని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ.విజయేందిర మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో కృషి చేసిన ఫలితానికి మీరుసాధించిన అత్యుత్తమరిజల్ట్స్ గొప్ప నిదర్శనమని తెలుపుతూ విద్యార్థులను సర్వతో ముఖాభివృద్ధి కోసం తీర్చిదిద్దిన టీచర్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు నాంపల్లి మల్లేశం, తిర్మలాపూర్ మాజీ ఉప సర్పంచ్ నాగేల్లి నరసయ్య, పూర్వ విద్యార్థులు చేన్న దేవేందర్, కట్టెకోల రాజు, జల్ద సుధాకర్, పాఠశాల టీచర్స్ హైమదుల్లా ఖాన్, సంపత్ కుమార్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.



