భీమారం
ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం

viswatelangana.com
February 14th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి / భీమారం ప్రతినిధి: జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేగిత్తుతున్నాయి పాఠశాల స్లీపర్ యధావిధిగా పొద్దున పాఠశాల తెరిచి చూడగా పాఠశాలలో క్షుద్ర పూజలు జరిగినట్లుగా అక్కడి వాతావరణాన్ని బట్టి తెలుసుకొని ప్రధానోపాధ్యాయులకు , గ్రామ పెద్దలకు తెలియజేయడం జరిగింది ఇట్టి విషయం పట్ల గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురి కావడం జరిగింది.



