కోరుట్ల
ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే

viswatelangana.com
July 29th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల డిపోలో ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే ను డిపో మేనేజర్ సూచనల మేరకు. ట్రాఫిక్ సూపర్డెంట్ వర్జిలాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి డ్రైవర్లు వారి ఫ్యామిలీలతో కౌన్సిలింగ్ కు హాజరు కావడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రాఫిక్ సూపర్డెంట్ వర్జిలాల్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకై డ్రైవర్ల ఫ్యామిలీకి తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డ్రైవర్లు వారి ఫ్యామిలీ మరియు ఆఫీస్ సూపర్ వైజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానిక్ సూపర్వైజర్లు, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ శేఖర్ పాల్గొన్నారు.



