కోరుట్ల
ప్రమాదాలు, సోషల్ మీడియా, మోసలపై పోలీస్ బృందంచే అవగాహనా కార్యక్రమం

viswatelangana.com
March 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణం ఏకిన్ పూర్ ఆరో వార్డులో జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోరుట్ల పోలీసు వారి ఆధ్వర్యంలో పోలీస్ కళాకారుల బృందం చే చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై-2 రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ టూ వీలర్ వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారని అలా చేయడం ద్వారా కుటుంబానికి పెద్దదిక్కుని కోల్పోతున్నారని అలాగే మైనర్లకు టూవీలర్లను ఇస్తే తల్లిదండ్రుల పై కేసులు పెడతామని అలాగే యువత, విద్యార్థులు పెడదారిన పడి గంజాయి తాగకూడదని అదేవిదంగా ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించవద్దని, అలాగే పోలీస్ చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో ఎస్సై రామచంద్ర గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఆరో వార్డ్ ఇంచార్జ్ మ్యాదరి లక్ష్మణ్ అలాగే గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు, విద్యార్థులు, పాల్గొన్నారు



