కొడిమ్యాల
ప్రవీణ్ పగడాల మృతికి సంతాపాన్ని తెలిపిన కొడిమ్యాల క్రిస్టియన్ అసోసియేషన్

viswatelangana.com
March 26th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
అధ్యక్షులు బొల్లుమల్ల జీవన్ కుమార్ ఇండియా క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ ప్రవీణ్ పగడాల దుర్మరణానికి చింతిస్తూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రార్థన మందిరం వద్ద కొడిమ్యాల క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లుమల్ల జీవన్ కుమార్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ నాయకుల అందరితో కలిసి తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల 14 అనాధ పిల్లలను చేరదీసి విద్యానందిస్తున్నాడని అనేకమంది నిరుపేద యువతకు ఉద్యోగాలు కల్పించాలని దైవత్వమును గూర్చి గొప్పగా ప్రకటించిన మేదస్సుగలవాడని కొనియాడారు శుక్రవారం రోజున కొడిమ్యాల మండల కేంద్రంలో వివిధ సంఘాల నాయకులతో కలిసి సంతాప కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండల క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యులు, క్రీస్తు సైన్యం సభ్యులు తదితరులు పాల్గొన్నారు



