ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం రోజున ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహించారు. కథలాపూర్ మండల కేంద్రంలో ర్యాలీ చేశారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకుందాం, మలేరియాను తరిమికొడదాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారిణి పి.సింధూజ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వీధుల్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగే నీటి విషయంలో చిన్న చిన్న విషయాలను పాటించినట్లయితే పెద్ద వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. మలేరియా వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. మలేరియా దినోత్సవం అనేది వ్యాధి ప్రభావం, దాని వ్యాప్తిని నియంత్రించే, నిరోధించే ప్రయత్నాల గురించి అవగాహన పెంచడానికి మంచి అవకాశమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2030 సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలనకు కలిసి పని చేద్దామన్నారు. కార్యక్రమంలో వైధ్యాధికారిణి సింధూజ, సీహెచ్ఓ సుగుణ, సిహెచ్ఎన్ లూసీ, హెల్త్ సూపర్ వైజర్ నాగభూషణం,ల్యాబ్ టెక్నీషియన్ చిన్న రాజం, ముక్తార్ ఏఎన్ఎమ్ లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.



