బాధితురాలికి లైఫ్ భీమా చెక్కు అందజేత

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన చడాల గంగారెడ్డి అనే వ్యక్తి గత కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మృతిచేందాడు. గంగారెడ్డి ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్సులో స్మార్ట్ హంసఫర్ పాలసీని రూ, 25 వేయిల ప్రీమియంతో తీసుకున్నాడు. రెండు ప్రీమియంలు చెల్లించిన అతను గుండెపోటుతో మృతిచ్చేందగా అతని భార్య జ్యోతికి ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ, రెండు లక్షల యాభై వేయిల భీమా చెక్కును బుధవారం ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జగిత్యాల డివిజనల్ మేనేజర్ మూల అనిల్, సీనియర్ టేర్రీటరీ మేనేజర్ పల్లికొండ రాజేందర్ అందజేశారు. బాధిత కుటుంబానికి 2.5లక్షల భీమతో పాటుగా భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంలు కంపెనీ చెల్లిస్తుంది. కాగా మృతుడి భార్య జ్యోతికి జీవితాభీమా కొనసాగిస్తూ మేట్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుందని సీనియర్ టెర్రీటరీ మేనేజర్ పల్లికొండ రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ లైఫ్ సీనియర్ అడ్వైసర్స్ గొల్లపెల్లి హరీష్, హరికృష్ణ, నరేష్, లత మరియు భూపతిపూర్ మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ యాచామనేని మహేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.



