బాహుబలి ప్రభాస్ లా పుస్తకాలు ఎత్తిన బుడ్డోడుబాహుబలి ప్రభాస్ లా పుస్తకాలు ఎత్తిన బుడ్డోడుపుస్తకాల ధర 6 వేల రూపాయలకు పైనే
మా స్కూల్ మా ఇష్టం - చెప్పినట్టే వినాలి- అడిగినంత ఇవ్వాలి అంటున్న యాజమాన్యం

viswatelangana.com
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఒక ప్రధానమైన ప్రైవేట్ పాఠశాలలో ఈ ఫోటో చిక్కింది. ఈ బుడ్డోడు చదివేది నాల్గవ తరగతి. వీడు బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగం ఎత్తినట్టే. పుస్తకాలను ఎత్తేశాడు. వీడి వయ్యసు 9 సం. బరువుకు మించి పుస్తకాలు అలాగే వాటి ధర ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. వెయ్యి, రెండు వేలు కాదు, ఏకంగా 6 వేలకి కొద్దిగా దూరంలో ఉన్నాయి. ఈ పుస్తకాలు కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యాలు చెప్పిన చోటే తీసుకోవాలంట. ఈ పుస్తకాలు ఇక్కడే ఉంటావంట. వేరే ఎక్కడ ఉండవంట.సరే ఉండని, కానీ ఈ ధర ఏంది ఇంతలా ఉంది. చదివే బుక్స్ వచ్చేసి తొమ్మిది ఉన్నాయి, వాటి ధర వచ్చేసి ఒక్కో పుస్తకానికి 2వందల 50 రూపాయిలు వేద్దాం అంటే వాటి మొత్తం విలువ 2 వేల 250 రూపాయిలు ఇది మనం వేసుకున్నది. ఇంకా ఉన్నాయి స్కూల్ టీచర్ చెప్పితే విని రాసేవి నోట్ బుక్స్ ఇవో పదహారు ఇచ్చారు. వీటి ధర వచ్చి ఒక్కొకక్కటి 60 రూపాయిలు ఉన్న మొత్తం కలిపితే 9 వందల 60 రూపాయిలు అవుతున్నాయి, కానీ 6 వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది! ఇలాంటి పాఠశాలలపై ప్రభుత్వము సీరియస్ గా చెపుతున్న, పట్టించుకోకుండా దోచేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు, అలాగే పట్టించుకోని విద్యా అధికారులు మరి దీనివెనుక ఇంకా ఎవరివి అయిన పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయా! విద్యార్థుల తల్లి తండ్రుల దగ్గర జలగలు రక్తం గుంజినట్టే, ఈ పాఠశాల యాజమాన్యాలు ఫీజులు గుంజుతున్నారు. వీరిపై చర్యలు తీసుకునే వారే లేరా? మరి ఇలాంటి పాఠశాల యాజమాన్యాలు అంటే బయమా? అంతూ చిక్కన్ని ప్రశ్నగా మిగిలి పోతుంది. ఇష్టం వచ్చినట్లు ఫీజుల వనూలు ఇకనైనా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై ప్రభుత్వం వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పిల్లల తల్లి తండ్రులు వేడుకుంటున్నారు.



