బిఆర్ ఎస్ ఖాళీ అవుతోందా….?

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో క్రమేపి బిఆర్ ఎస్ పార్టీ పట్టుకోల్పోతుంది. తాజా మాజీ సర్పంచ్ ల చేరికతో కాంగ్రెస్ పార్టీ జోష్ కొనసాగిస్తుండగా, బిఆర్ ఎస్ లో కథలాపూర్ మండలం బడా నేతల ఏకపక్ష నిర్ణయాలు, కార్యకర్తలకు విలువివ్వకపోవడం, పార్టీ కి మండల అధ్యక్షిడిని ఇంకా నియమించకపోవడం పార్టీ ప్రతిష్ట దిగజారిపోవడానికి కారణమని అంటున్న ప్రజలు. ఇది వరకే బిఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గడీల గంగప్రసాద్ చేరికతో మండల సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు మిట్టపెల్లి గంగారెడ్డి కి లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది. గంగారెడ్డి ఆదివారం కండువా కప్పుకోగా సోమవారం రోజున బొమ్మెన మాజీ సర్పంచ్ లావణ్య భర్త తిరుపతి రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇదిలా ఉండగా మండలంలోని ఒక బడా నేత 200 మంది కార్యకర్తలతో రేపో మాపో కాంగ్రెస్ లో చేరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్ని చూస్తుంటే బిఆర్ ఎస్ పార్టీ మెల్లి మెల్లిగా ఖాళీ అవుతున్న సంకేతాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయనేది సగటు బిఆర్ఎస్ కార్యకర్త వాదన.



