
viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు ఆదేశాల మేరకు వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం రైతు భరోసా కోసం నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టడం జరిగింది. ఇందులో పలువురు నాయకులు కనబడకపోవడం చాలామంది బిఆర్ఎస్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. రెండు వర్గాలుగా ఏర్పడ్డాయని గుసగుసలు వినబడటంతో ధర్నాలో పాల్గొందామా?వద్దా?అంటూ చాలామంది దూరంగా ఉండిపోయారని వినికిడి. బిఆర్ఎస్ అభిమానులు ఎవరితోటి పోవాలో తెలియక అయోమయంలో బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇట్టి ధర్నా కార్యక్రమం లో నాయకులు మామిడిపెల్లి రవి, గండ్ర కిరణ్ రావు, వంగ రవీంధర్, కేసరి సాయన్న, ముస్కరి కిరణ్, బాల్క సంజీవ్, పానుగంటి తిరుజాని, మామిడిపెల్లి రమేష్, మామిడిపెల్లి రాకేష్, నల్ల గంగారెడ్డి, నల్ల గంగాధర్, జవిడి ప్రతాప్ రెడ్డి, జలపతి, ఎండి ముజీబ్, సోమ దేవేందర్ రెడ్డి, కుంట నరేష్, చెల్లపెల్లి అంజయ్య, జీర అజయ్, మంచాల మహేష్, కల్లూరి రమేష్, వెగ్యారపు లింబాద్రి, కడారి వెంకటస్వామి, ఉరుమల్ల కిరణ్, చెక్కపెల్లి రాజ్ కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



