రాయికల్
బిజెపి పట్టణ అధ్యక్షులుగా కుర్మమల్లారెడ్డి

viswatelangana.com
May 6th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన కుర్మ మల్లారెడ్డిని బిజెపి పట్టణ అధ్యక్షులుగా నియామకం చేస్తూ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ప్రకటించారు. 2002-2004 వరకు ఏబీవీపీ మండల కన్వీనర్ గా, గతంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా,రాష్ట్ర కిషన్ మోర్చా కార్యవర్గ సభ్యులుగా క్రియాశీలకంగా పనిచేశారు. మల్లారెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్షులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన ఎంపి ధర్మపురి అరవింద్, మాజీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో బీజేపీ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.



