రాయికల్
బేటి బచావో బేటి పడావో అవగాహన సదస్సు

viswatelangana.com
December 10th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
మహిళ సాధికారత ఆద్వర్యం లో బేటి బచావో బేటి పడావో పథకం లోని భాగంగా, రాయికల్ ధనలక్ష్మి మండల సమాఖ్య మీటింగ్ సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత, భేటీ బచావో బేటి పడావో పథకం, ఆడపిల్ల చదువు యొక్క ప్రాముఖ్యత, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, మొబైల్ మరియు సోషల్ మీడియా దుష్ప్రభావం,బాల్యవివాహాల నిషేధ చట్టం మరియు మహిళల రక్షణ చట్టాల, హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి వివరించడం జరిగింది. 100, 112, 181, 14567, 1098, సఖి సేవలు, అంగన్వాడి సేవలు, చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్స్ ,సీనియర్ సిటిజన్స్ గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం- శ్రీనివాస్ చక్రవర్తి సీ.సీ- సుజాత సీ.సీ- కమల కుమారి సీ.సీ- గంగమని సీ.సీ-శ్రీనివాస్ డిహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది మరియు వివో,వివో ఏలు మహిళలు పాల్గొన్నారు.



