కథలాపూర్

బొమ్మెన ప్రాథమిక పాఠశాల లో కృత్రిమ మేధస్సు తో విద్యార్థులకు గణిత విద్యా బోధన ప్రారంభం

viswatelangana.com

April 21st, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

బొమ్మెన ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులను ఈ పోటీ ప్రపంచంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సంసిద్ధులను చేయుటకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు గణితంను కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)ను ఉపయోగించి కంప్యూటర్ ద్వారా బోధన ప్రారంభించడం జరిగింది. పైలట్ ప్రాజెక్టు కింద ఈ విద్యా సంవత్సరం జిల్లాకు 5 ప్రాథమిక పాఠశాల ను ఎంపిక చేయడం జరిగింది అందులో భాగంగా బొమ్మెన ప్రాథమిక పాఠశాల ఎంపిక కావడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు అంబటి రవి మాట్లాడుతూ కంప్యూటర్ ద్వారా బోధనా జరుగుతున్నందు వల్ల విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారని, పాఠాల ను సులభంగా అర్థవంతంగా నేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిరెడ్డి, రమేష్, శివకృష్ణ, ప్రశాంత్, శిరీష, శ్రావణి, వర్ణ, రాజేశ్వరి లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button