కథలాపూర్
బొమ్మెన ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

viswatelangana.com
October 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని బొమ్మెన ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలలలో ముందస్తు బతుకమ్మ పండుగ పురస్కరించుకొని ఎంగిలిపూల బతుకమ్మ కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు ఘనంగా బతుకమ్మ పాటలు పాడుతూ పిండి వంటలతో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంబటి రవి,మధు, ఉపాధ్యాయులు సాయి రెడ్డి, రమేష్, శివకృష్ణ, ప్రశాంత్, శ్రావణి, వర్ణ, శ్రీనివాస్, రాజేష్, శ్రీధర్, సవిత తదితరులు పాల్గొన్నారు.



