కొడిమ్యాల
భళా…. మాస్టారు….

viswatelangana.com
October 22nd, 2024
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మడి హరికృష్ణ ప్రసాద్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఎంపీపీఎస్ నూకపల్లి మల్యాల మండలంలో పనిచేస్తున్నారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా బడిని మార్పు చేశారు. విద్యార్థులకు దసరా సెలవులు రాగానే హరికృష్ణ ప్రసాద్ పాఠశాలను మా మార్పు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తరగతి గదులకు ప్రహరి గోడలకు తానే స్వతహాగా వేయడం పి పెయింటింగ్స్ వేయడం జరిగింది. విద్యార్థులు అభ్యసనలో ఉత్తేజం పొందేలా పాఠ్య పుస్తక బొమ్మలను గోడల మీద గీయడం జరిగింది. పాఠశాలలోని మార్పును చూసి తల్లిదండ్రులు విద్యార్థులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు



