కోరుట్ల
మతాలకతీతంగా సోదరబావం పెంపొందించాలి -డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com
March 26th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
మత సామరస్యానికి ప్రతికగా నిలిచే రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ను బుధవారం తన నివాసంలో జమాతే ఇస్లాం కోరుట్ల పట్టణ అధ్యక్షులు ఎండి ఇలాయాస్ ఖాన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పేట భాస్కర్ కు ఇప్తార్ బాస్కిట్ ఫలాలు అందించారు. మతాలకతీతంగా సోదరబావం, ప్రేమతత్వం పెంపొందించే ప్రయత్నంలో ఆందరు భాగస్వామ్యులు కావాలని పేట భాస్కర్ కోరారు.



