మహానీయులు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిబా పూలే, బి ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను విజయవంతం చేద్దాం- డాక్టర్ పేట భాస్కర్ పిలుపు

viswatelangana.com
భారత దేశ ఔన్నత్యాన్ని దశ దిశల విస్తరించి అనగారిన ప్రజల హక్కులు సాదించి దేశ పౌరుల మహోన్నతికి ఎనలేని కృషి చేసిన మహానీయులు పూజ్య బాబు జగ్జీవన్ రామ్, మహత్మ జ్యోతిబా పూలే, డా. బి ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను ఘనంగా విజయవంతం చేద్దామని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర నాయకులు బలిజ రాజరెడ్డిలు పిలుపునిచ్చారు. గురువారం కోరుట్లలో పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆద్వర్యంలో ఏప్రిల్ 5 న దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, 11 న దేశ పౌరులకు విద్యానే ప్రధానమని తన జీవితాన్ని అంకితం చేసిన మహత్మ జ్యోతిబా పూలే, 14 న భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వజ్ఞాని డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా ఎలాంటి లోటు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఏప్రిల్ మాసమంటేనే మహానీయుల జన్మదినోత్సవాల పండగలని వారి విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే గ్రామ గ్రామన నెలకొల్పాలని కోరుట్లతో పాటు జిల్లాలో అంగరంగవైభవంగా ఉత్సవాలను జరుపుకుందామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, ఎన్ ఎచ్ ఎఫ్ పట్టణ అధ్యక్షులు షాహేద్ మహ్మద్ షేక్, మాదిగ కుల సంఘం అధ్యక్షులు శనిగారపు రాజేష్, కార్యదర్శి మోర్తాడ్ రాజశేఖర్, మాల సంఘం అధ్యక్షులు పొట్ట లక్ష్మణ్, కార్యదర్శి బలిజ సంతోష్, నాయకులు సామల్ల వేణుగోపాల్, గొండి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



