
viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకుడు ముదాం శేఖర్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలోనే కరెంట్ కష్టాలుమొదలయ్యాయని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతన్నారని, గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని. అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి, అన్ని వర్గాల ప్రజలకు వనరులు, సంపద దక్కడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు కేసీఆర్ ను నమ్మటం లేదని అందుకే జగిత్యాల జిల్లాను తీసివేస్తున్నారంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారం కోల్పోయే సరికి మాజీ సీఎం కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు.



