ముంజంపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏకగ్రీవం

viswatelangana.com
ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని ముంజం పల్లి గ్రామంలో జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి మోకన పల్లి సతీష్, ఎండపల్లి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చెన్న కుమారస్వామి ల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ శాఖ అధ్యక్షులుగా చొప్పదండి భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా చొప్పదండి రాజయ్య, ఉపాధ్యక్షులుగా దూడ తిరుపతి, అధికార ప్రతినిధిగా దూడ లచ్చయ్య, కోశాధికారిగా దూడ కనకయ్య, ప్రచార కార్యదర్శిగా చొప్పదండి చంద్రయ్య కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించే లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని విజయవంతం చేయాలని, ఎమ్మార్పీఎస్ బలోపేతమే లక్ష్యంగా గ్రామ గ్రామాన నూతన కమిటీలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నూతన కమిటీకి గ్రామస్తులు ఎమ్మార్పీఎస్ నాయకులు అభినందనలు తెలిపారు


