వేములవాడ
ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర
viswatelangana.com
February 16th, 2024
వేములవాడ (విశ్వతెలంగాణ) :
కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర నేడు అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీలో ఈ యాత్ర కొనసాగగా, మొత్తం 81 గ్రామాల్లో విజయవంతంగా ప్రజాహిత యాత్ర ముగిసింది. ఏ గ్రామానికి వెళ్లినా స్థానికులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. గడపగడపకు తిరుగుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాల వారిగా వెచ్చించిన నిధులను లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ప్రజల కష్టాలను స్వయంగా అడిగి బండి సంజయ్ సమస్యల పరిష్కారం కోసం మరింత కృషి చేస్తానని, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి మరోసారి కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపించాలని ప్రజలను బండి సంజయ్ గారు కోరడం జరిగింది.

