రాయికల్
మున్సిపల్ కార్మికులకు సేఫ్టీ వస్తువుల పంపిణీ
viswatelangana.com
September 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం రోజు మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సేఫ్టీ వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కార్మికుల భద్రతకు అవసరమైన హెల్మెట్లు,గ్లోవ్స్, మాస్కులు,గమ్ బూట్లు వంటి సురక్షిత పరికరాలను అందించారు. మున్సిపల్ అధికారులు కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించి ఈ వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు కార్మికులకు పర్యావరణం శుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర ఎంత ముఖ్యమో చెప్పి, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సేఫ్టీ వస్తువులు ఉపయోగపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



