మేడిపల్లి మండల కేంద్రంలో ఘనంగా యువనాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్,వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పిలుపు మేరకు, రాష్ట్ర ఎన్ఆర్ఐ గల్ఫ్ కన్వీనర్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మిర్ వరకు భారత్ జోడో యాత్ర, మణిపూర్ నుండి ముంబై వరకు న్యాయ్ యాత్ర చేసి దేశ ప్రజలను చైతన్య పరిచారు అని అన్నారు, బీజేపీ చేస్తున్న నియంత పాలనను ప్రళదోలాడానికి కంకణబద్దుడై చీకట్లను చిల్చుకొని ఉదయించిన సూర్యుని వలే రాహుల్ గాంధీ ఉన్నారు అని కొనియాడారు, అలాగే మూడోసారి బీజేపీ పార్టీ కేంద్రం లో ఏర్పడి ప్రధాని నరేంద్ర మేడి అయినా అది నైతికంగనే అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీ దే అని నరేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం లో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జెలెందేర్, ప్రధాన కార్యదర్శి శ్రీపతి దామోదర్, ఉపాధ్యక్షులు మార్గం నర్సారెడ్డి, అధికార ప్రతినిధి చేపూరి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి మల్లేశం, సీనియర్ నాయకులు ఊరుమట్ల నర్సయ్య, మ్యాదరి రాజన్న, స్వామి గౌడ్, కుంట శంకర్, ముస్కెం జెలెందేర్, నారాయణ, కృష్ణ, లింబద్రి, చాంద్ బాయ్, అజయ్, జిల్లా రమేష్, మార్గం నవీన్, శ్రీనాథ్, సురేందర్, రామస్వామి, తోట రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



