మైనారిటీ రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల బదిలీలతో నిరాశలో క్లాట్ పరీక్ష విద్యార్ధులు

viswatelangana.com
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కారణంగా విద్యార్థులు వారి సంరక్షకులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. క్లాట్ (కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు సిద్దం అవుతున్న విద్యార్థులు క్లాట్ పరీక్ష ద్వారా దేశంలోని 24 విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందుతారు. ఆయా విశ్వవిద్యాలయాలలో ప్రవేశాల కోసం మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. హైదరాబాద్ లోని బార్కాస్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అనే జూనియర్ కళాశాలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులు పొందిన విద్యార్థులు మాత్రమే ఈ జూనియర్ కళాశాలలో అర్హత పొందుతారు. మైనారిటీ రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు జరుగడం వల్ల క్లాట్ పరీక్ష కోసం లీగల్ రీజనింగ్ బోధించే ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళడంతో వారి స్థానంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుడు పదోన్నతి పొంది పౌరనీతి శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు వచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ ఈ విద్యార్థులకు క్లాట్ పరీక్ష డిసెంబర్ 01 వ తేదిన, విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా ఈ పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో దురదృష్టం వల్ల ఈ ఉపాద్యాయులు బదిలీలు కావడంతో విద్యార్థులకు చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంరక్షకులు ఈ విషయాన్ని గ్రహించి మైనారిటీ విద్యాసంస్థలకు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిని కలిసి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎదురవుతున్న ఇబ్బందులను తెలియపరచుకుందామనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ లోని కార్యాలయానికి వెళ్ళి, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 05 గంటల వరకు వేచి చూసినా గానీ సదరు ఉన్నతాధికారి సంరక్షకులకు సమయం కేటాయించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ ఒకటో తేదీ వరకు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులనే కొనసాగించినట్లయితే విద్యార్థులు వారి ఆశయాలను సాధించుకునే ఆకాంక్షతో ముందుకు వెళ్తారని సంరక్షకులు కోరుతున్నారు.



