రాయికల్
మొక్కజొన్నకు నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు

viswatelangana.com
April 17th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వస్తాపూర్ గ్రామంలో గడ్డం దీపక్ రెడ్డికి చెందిన మొక్కజొన్న పంటను గురువారం గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. తన పొలంలో ఉంచిన మొక్కజొన్న కంకులు పూర్తిగా దగ్ధమయ్యాయని, సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.



