రాయికల్
యఫ్ యల్ యన్ పర్యవేక్షణ

viswatelangana.com
September 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని వీరాపూర్ ధర్మాజీపేట గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం జరుగుతున్న తీరును జిల్లా సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేష్ మంగళవారం పర్యవేక్షణ చేశారు. విద్యార్థుల కనీస అభ్యసన స్థాయిలను తెలుసుకున్నారు. అనంతరం తాట్లవాయి ఉన్నత పాఠశాలలో న్యాస్ పరీక్షలపై అవగాహన కల్పించారు. తగు సూచనలు ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, జనార్దన్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు



