కోరుట్ల
యువ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఉరి తీయాలి
మెట్ పల్లి మర్కజి ఇంతే జామీ కమిటీ మిల్లత్ - ఇస్లామియా అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా

viswatelangana.com
August 16th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోల్కత్తలో యువ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని, మెట్ పల్లి మర్కజి ఇంతే జామీ కమిటీ మిల్లత్ – ఇస్లామియా అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా డిమాండ్ చేసారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కోల్కత్తలో ట్రైనీ డాక్టర్ పై కామందులు అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేయడం దారుణం అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఇలాంటి సంఘటన జరగడం సిగ్గు చేటని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వదిలి నిందితులను ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.



