రాయికల్
రక్తహీనత, పౌష్టికాహారం పై అవగాహన

viswatelangana.com
April 8th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధావన్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం రోజున పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లులకు గర్భిణీలకు బాలింతలకు కిషోర్ బాలికలకు రక్తహీనతపై, పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం జరిగింది. గర్భవతులకు మిల్లెట్స్, ఆకుకూరలు, పల్లి పట్టీలు రెగ్యులర్ గా తీసుకోవాలని అలాగే సరైన ఆహారం తీసుకోకపోతే దాని వలన కలిగే నష్టాలను వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గీతారాణి, ఏఎన్ఎం లలిత, అంగన్వాడీ టీచర్ రోజా, ఆయమ్మ అమృత, మరియు పిల్లలు, తల్లులు, గర్భవతులు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.



