కొడిమ్యాల
రజాకార్ల తూటాలకు తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

viswatelangana.com
April 3rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి కొల్లాపురం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొత్తూరి స్వామి పాల్గొని మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం తెలంగాణ మరియు,వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ కోసం పోరాడి రజాకర్ల తూటాలకు తొలి అమరవీరుడైన దొడ్డి కొమరయ్యఆశయాలను తెలంగాణ ప్రజలు కొనసాగించాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో నేరెళ్ల రాజయ్య.గుండు రమేష్. లింగాల అజయ్ గుండు మహేష్ పెంట రామయ్య కొత్తూరి ఆనందం చిన్న రాములు. సురుగు శంకర్ గుండు లచ్చయ్య లింగంపల్లి నరసయ్య తదితరులు పాల్గొన్నారు



