కోరుట్ల
రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి

viswatelangana.com
September 16th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట సోమవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, సీతక్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపదాస్ మున్షీ, పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు, కేశవరావు, తదితరులతో కలిసి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి, లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శేర్ నర్సారెడ్డి ఇట్టి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.



