రాయికల్
రాయికల్ మండలంలో నాటు తుపాకీ కలకలం

viswatelangana.com
March 24th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.గ్రామంలో సదరు వ్యక్తుల కదలికలపై అనుమానం రావడంతో గ్రామస్తులు వారిని విచారించి తనిఖీ చేయగా నాటు తుపాకితో పాటు బుల్లెట్ దొరికింది. దానిపై వారిని ప్రశ్నించగా వారు చెప్పే సమాధానాల్లో పొంతన లేకపోవడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామాలలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనబడితే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై సిహెచ్.సుధీర్ రావు తెలిపారు.




